జపాన్‌ డబ్బింగ్‌ షురూ

Japan dubbing Shuruహీరో కార్తీ ప్రస్తుతం ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వంలో నటిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘జపాన్‌’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్‌ పనులు ప్రారంభం అయ్యాయి. కార్తి తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న వీడియోని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. కార్తి డబ్బింగ్‌ చెబుతుంటారు. కానీ టేక్‌ ఎంతకీ ఓకే అవ్వదు. చివరికి టైటిల్‌ రోల్‌ జపాన్‌ గెటప్‌తో వచ్చి చెప్పడంతో ఓకే అవుతుంది. ఈ వీడియో యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తి డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించబోతున్నారు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్‌ విజరు మిల్టన్‌ తొలిసారిగా నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spread the love