అశ్వారావుపేట నాలుగో ఎమ్మెల్యేగా జారే ప్రమాణం స్వీకారం…

– పలువురి శుభాకాంక్షలు…

నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజక వర్గం నాలుగో ఎమ్మెల్యేగా జారే ఆదినారాయణ శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసారు.ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన తెలంగాణ మూడో అసెంబ్లీలో అశ్వారావుపేట నియోజక వర్గం నుండి నాలుగో ఎమ్మెల్యేగా జారే ఆదినారాయణ ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో ఆశ్రమం పాఠశాల పి.ఇ.టిగా విధులు నిర్వహించే ఆదినారాయణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన అనంతరం మొదటి సారి 2014 లో జరిగిన ఎన్నికల్లో ఉపాద్యాయ వృత్తికి రాజీనామ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసారు. వైఎస్ ఆర్ సి పి అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించగా జారే ఆదినారాయణ మూడో స్థానంలో నిలిచారు. నాటి నేటి వరకు ఏదో కార్యక్రమం పేరుతో నియోజక వర్గం ప్రజల్లో తలలో నాలుక లా మెలగడం తో విజయం వరించింది. 2014 లో పాటశాల నుండి నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన జారే నేడు అసెంబ్లీలో ప్రవేశించారు. నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ ఇరువురిది అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండలం గండుగులపల్లి ఒకే ఊరు కావడం మరో ప్రత్యేకత. దీంతో పలువురు నాయకులు, అధికారులు, సంఘం నాయకులు వీరి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love