నవతెలంగాణ – హైదరాబాద్: తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నం.01 స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 870 రేటింగ్ పాయింట్లతో నం.01 ర్యాంక్ దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మరీ బుమ్రా నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. అశ్విన్ 869 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో ఇలా ఇద్దరు భారత బౌలర్లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఇక బంగ్లాతో టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరూ కూడా చెరో 11 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. కానీ, బుమ్రా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం అతనికి కలిసొచ్చింది.