ఈ నెల 5న శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మద్నూర్ ఆధ్వర్యంలో(మర్క్ఫెడ్, నాఫెడ్)ద్వారా సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని సహకార సంఘం కార్యదర్శి జే బాబురావు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. మద్దతు ధర కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరవుతారని తెలిపారు. కొనుగోలు కేంద్రం మద్నూర్ మార్కెట్ యార్డు యందు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రైతులు పండించిన సోయా పంటను మద్దతు ధర కేంద్రానికి తీసుకువచ్చి అమ్మకాన్ని జరుపుకోవాలని కార్యదర్శి కోరారు. ఈ కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సంఘం సభ్యులు సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.