టైలరింగ్ పనులలో నాణ్యత ఉండాలి: జయదేవ్ ఆర్య

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్ టైలరింగ్ పనులలో నాణ్యతగా ఉండాలని సిద్దిపేట డిఆర్ డి ఓ జయదేవ్ ఆర్య అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలోని శ్రీ శక్తి స్వశక్తి టైలరింగ్ యూనిట్ ను సిద్దిపేట  డిఆర్డిఓ జయదేవ్ ఆర్య సందర్శించారు. స్కూల్ పిల్లల యూనిఫామ్ లు ఏ విధంగా కుడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ప్రారంభ కాకముందే విద్యార్థులకు యూనిఫామ్స్ అందేలా పనులు చకచక చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో సి ఆర్ డి స్వామి గౌడ్ , ఎంపీడీవోలు వేణు గోపాల్ రెడ్డి, జయరామ్, సేర్ఫ్ ఏపిఎం జి శ్రీనివాస్ గౌడ్,, ఏపీవోలు రమాదేవి, ప్రభాకర్, సీసీలు అశోక్, రవీందర్, శ్రీలత, ఈజిఎస్ సిబ్బంది  పరశురాములు, శ్రీధర్ పాల్గొన్నారు.
Spread the love