వ్యవసాయ కళాశాల లో జయశంకర్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ (ఎఫ్‌ఏ‌సి) డాక్టర్ వి.వెంకన్న జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. కళాశాల సిబ్బంది,విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌నచేసిన సూచ‌న‌లు,స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలుగా నిలుస్తాయ‌ని అన్నారు. విద్యార్తులు కొత్తపల్లి జయశంకర్ త్యాగాల గురుంచి కొనియాడరు.మా తరం వారికి ఆయన ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని తెలిపారు.ప్రతి విద్యార్థి ఇలాంటి మహనీయుల గురుంచి తెలుసుకొని వారి బాటలో నడుస్తూ దేశ భవిష్యత్లో ప్రధాన పాత్ర వహించాలి అంటూ విద్యార్థిని విద్యార్థులు హరీష్, అంజలి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవ పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్) నిర్వాహకులు డాక్టర్ ఆర్.రమేశ్, డా.కె.శిరీష నిర్వహించారు.కళాశాల బోధన సిబ్బంది శ్రీమతి జంబమ్మ, డా.టి.శ్రవణ్ కుమార్, డా.దీపక్ రెడ్డి, కుమారి.అశ్విని మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.
Spread the love