– 63,982 ఓట్ల తో భారీమెజార్టీ
– నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జయవీర్
నవతెలంగాణ –పెద్దవూర : నాగార్జున సాగర్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రేస్ అభ్యర్థి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి కీ ప్రజలు పట్టం కట్టారు.
సాగర్ నియోజకవర్గం లో మొత్తం 2,33,567మంది ఓటర్లుఉండగా ఆదివారం జరిగిన కౌంటింగ్ లో మొత్తం 200235 మంది ఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. సాగర్ ప్రజలు చేతి గుర్తుపై ఓటువేసి తన అభిమానం చాటుకున్నారు. ఓటింగ్ మొదలైనప్ప టినుంచి 22 రౌండ్లు లో ప్రతి రవుండు లోజయవీర్ అధిక మెజార్టీ తో దూసుక వెళుతున్నారు.తాజాగా విడుదలైన ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం అందుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్డి కీ 1,11,983ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల బగత్ కు 55,849 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్ 63,982 ఆధిక్యం తో సాగర్ నియోజకవర్గం లో చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా జయవీర్ గిరిజన తండాలలో పాదయాత్ర, కాంగ్రెస్ ఆరు హామీలు ప్రజల్లో చొచ్చుక పోయాయి. నోముల భగత్ పై పూర్తి వ్యతిరేకం కనీసం మీడియా వారిని కూడా వ్యతిరేకించడం, లోకల్ లో తన వర్గం వారినే అపోహలు చాలావున్నాయి.