– దుబ్బాక లో వాల్ పోస్టర్ విడుదల చేసిన టీచర్స్& హెల్పార్స్
– అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ లక్ష్మీ
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఏళ్ల తరబడి అంగన్వాడీ లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో జూన్ 16 న ఆదిలాబాద్ లో రాష్ట్ర జీపుజాత ప్రారంభమై… జులై 10 న అన్ని జిల్లా కేంద్రాలకు చేరుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీలు విజయవంతం చేయాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ లక్ష్మీ పిలుపునిచ్చారు.మంగళవారం దుబ్బాక మండలకేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట జీపుజాత వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.కేంద్రం పెంచిన పెండింగ్ వేతనాలు 2018 అక్టోబర్ నుండి చెల్లించాలన్నారు. బడ్జెట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలన్నారు. ఈ కేంద్రాలలో ఆయాలను నియమించాలన్నారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ, డిఎలు, సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఓ నెం14 ను సవరించి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జీఓ నెం 19 సవరించాలన్నారు. గ్రాట్యుటీ టీచర్లకు రూ.3 లక్షలు, హెల్పర్లకు రూ.2 లక్షలు చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ నాటికి చెల్లిస్తున్న వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఐసిడిఎస్ కు సంబంధం లేని అదనపు పనులు చేయించకూడదనీ,కరోనాతో చనిపోయిన వారికి రూ .50 లక్షలు ఎక్రేషియా వెంటనే అమలుచేయాలనీ డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ కోరారు. తదితర డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ కోరారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్.. అంగన్ వాడి టీచర్లు, పద్మ, అనిత, సరస్వతి, మమత, కల్యాణి, భారతమ్మ, భూలక్ష్మి, బసవరాని, రుక్కవ్వ, రాని, మనెమ్మ, కనకలక్ష్మి, పున్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.