జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..60 సీట్లు ఖరారు..!

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో మంచి జోష్ కనిపిస్తుంది. అప్పటి వరకు అప్పటిదాకా అంతంతమాత్రాన ఉన్న ఆ పార్టీ పరిస్థితి.. కర్ణాటక ఫలితాలతో మొత్తం సీనే మారిపోయింది. కర్ణాటక విజయంతో మంచి ఊపు మీద ఉన్న ఆ నేతలంతా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టారు. ప్రస్తుతం చేరికలతో ఆ పార్టీ రోజురోజకి పుంజుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి హస్తం గూటికి చేరుతుండగా.. ఈ ఊపు ముందు ముందు మరింత వేగంగా ఉంటుందని నేతలు అంటున్నారు. ఇది ఇలా వుండగా  మరోవైపు అభ్యర్థుల ఎంపికలో కూడా భారీగానే కసరత్తు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది అభ్యర్థుల ఎంపిక జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో 60 సీట్లు ఖరారు అయిపోయాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారంతా ఎవరి స్థానాల్లో వారు పని చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడం అనేది గత చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావ అంటూ తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే దూరంగా ఉన్నారు.. ఇప్పుడేమో అమిత్ షా దగ్గర మొకరిల్లారని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ దాగుడు మూతలు ఆడాయని.. ఇప్పుడు బీఆర్ఎస్-బీజేపీ డ్రామాలు బయటపడ్డాయని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Spread the love