నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు: జెత్వానీ

నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియాలో తనను కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారని నటి కాదంబరి జెత్వానీ వాపోయారు. ‘కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు సాకుతో కొందరు ఐపీఎస్ అధికారులు నన్ను వేధించారు. వారిపై చర్యలు తీసుకోవాలి. ఓ టెర్రరిస్ట్‌లా నన్ను చూశారు. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టవద్దు. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ బిజీగా ఉంది. ఎప్పటికైనా నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.

Spread the love