పార్టీ కోసం పని చేసేవారికి గుర్తింపు: ఝాన్సీ రెడ్డి

– ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించాలి
– నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడితే చర్యలు
– పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి 
నవతెలంగాణ – పెద్దవంగర
పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద శాతం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో భూ కబ్జాల పేరు వినపడొద్దని, భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అన్నారు. నాయకులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించాలని సూచించారు. మండలంలో సుమారు 5000 మెజార్టీ వచ్చిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా నాయకులు సమన్వయంతో కలిసి పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, దుంపల కుమారస్వామి, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, జిల్లా కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, చిలుక దేవేంద్ర సంజీవరావు, బెడద మంజుల, పట్టణ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బొబ్బల రమణారెడ్డి, బానోత్ వెంకన్న, సీతారాం నాయక్, సతీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love