కార్యకర్తలకు అండగా ఝాన్సీ రెడ్డి: సురేష్

నవతెలంగాణ పెద్దవంగర:కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. మండల పరిధిలోని గంట్లకుంట గ్రామానికి చెందిన తేలుకుంట్ల వజ్రమ్మ (85) ఇటీవల వృద్ధాప్యంతో మృతి చెందారు. గురువారం కాంగ్రెస్ నాయకులు ఝాన్సీ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడొద్దని, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఝాన్సీ రెడ్డి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ ముక్తార్ పాషా, దాసరి శ్రీనివాస్, సీతారాం నాయక్, సైదులు, జాను, కర్ణాకర్, బండి బుచ్చి రాములు, ఎరుకలి యాకయ్య, మునగాల సోమ నర్సయ్య, కొండ్రాతి కొమరమల్లు, ముత్తినేని సోమన్న, సాయిని వీరయ్య, తేలుకుంట్ల సోమయ్య, తేలుకుంట్ల మహేష్, చింతల నర్సయ్య, గుర్రం శ్రీశైలం, బండి లచ్చయ్య, తాటిపాముల సంపత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love