నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జార్ఖండ్ ఎన్నికలకు సీపీఐ(ఎం) అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సురేష్ ముండా (తమర్ -ఎస్టీ), సపన్ మహతో (బహరగోర), మధువా కచప్ (సిసాయి – ఎస్టీ), పున్ భూయియో (చత్ర – ఎస్సీ), లఖన్ లాల్ మండల్ (జమ్తారా), షేక్ సైఫుద్దీన్ (పాకుర్), గోపిన్ సోరెన్ (మహేశ్‌పూర్ -ఎస్టీ), సనాతన్ డెహ్రీ (జామా -ఎస్టీ), కీర్తి ముండా (మహిళ) (మందర్ -ఎస్టీ) అభ్యర్థులను ప్రకటించింది.
సీపీఐ నుంచి తొమ్మిది మంది..
ఇండియా బ్లాక్ మిత్రపక్షాలు ఆఫర్ చేసిన సీట్ల కేటాయింపులపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సొంతంగా అభ్యర్థులను ప్రకటించింది. కన్హై చంద్రమల్ పహాడియా (నాలా), ఛాయా(శరత్), మహదేవ్ రామ్ (బర్కథా), రుచిర్ తివారీ (డాల్తోగంజ్), సంతోష్ కుమార్ రజక్ (కంకే), సురేష్ కుమార్ భుయా (సిమారియా), డోమన్ భుయా (ఛత్ర), మహేంద్ర ఒరాన్ (బిషన్‌పూర్), ఘన్‌శ్యామ్ పాఠక్ (భవన్‌పూర్)లు పోటీ చేస్తున్నారు. రాంచీ, మండు, బర్కాగావ్ హజారీబాగ్, పోరేయాహత్ అభ్యర్థులను రెండు రోజుల తరువాత ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.