రంగంలోకి దిగిన జితేందర్‌ రెడ్డి

‘బాహుబలి’, ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్‌ వర్రే ‘జితేందర్‌ రెడ్డి’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో జితేందర్‌ రెడ్డి పాత్రలో రాకేష్‌ వర్రే ఎంతో డైనమిక్‌గా, ఒక యంగ్‌ పోలీస్‌లా కనిపిస్తున్నారు. హీరోగా ఒక సినిమా చేసి హిట్‌ అందుకున్న తరువాత కూడా ఇంత గ్యాప్‌ తీసుకుని ఈ సినిమానే రాకేష్‌ ఎందుకు ఎంచుకున్నారు?, అసలు ఈ కథలో, ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ జితేందర్‌ రెడ్డి క్యారెక్టర్‌కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్‌ చేసి, చివరికి రాకేష్‌ వర్రే మాత్రమే ఈ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకోవడం విశేషం.

Spread the love