జితేందర్‌ రెడ్డిని తప్పించాలి!

– శాట్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి
హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు పదవి నుంచి ఏపీ జితేందర్‌ రెడ్డిని తప్పించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) మాజీ చైర్మెన్‌ ఏపీ జితేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘సీఎం వారించినా, అర్హత లేకపోయినా జితేందర్‌ రెడ్డి టీఓఏలో తలదూర్చాడు. జాతీయ క్రీడల్లో పోటీపడే రాష్ట్ర క్రీడాకారులు అయోమయంలో పడ్డారు. జితేందర్‌ రెడ్డి తక్షణమే ఐఓఏ అధ్యక్షుడిగా తప్పుకుని ఒలింపిక్‌ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలి. సలహాదారుగా అందరిని ఏకం చేయాల్సింది పోయి.. తానే ఓ సంఘంలో జోక్యం చేసుకుని వివాదాలు సృష్టించటం ఎంత వరకు సబబు’ అని అల్లీపురం ఆవేదన వ్యక్తం చేశాడు.

Spread the love