– హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
– కుటుంబానికి అండగా ఉంటా : మాజీ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమకారునిగా జిట్టా బాలకృష్ణారెడ్డి పోరాటం చేశారని, తెలంగాణ ప్రజల మనిషిగా ఎదిగారని, జిట్టా లేని లోటు ఎవరూ తీర్చలేనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్‌లో జిట్టా కుటుంబ సభ్యులు నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సంతాప సభకు హాజరైన ఆయన.. జిట్టా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, గాదరి కిషోర్, కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్, గవ్వల బాలరాజు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, గాయకులు ఏపూరి సోమన్న, వివిధ పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, జిట్టా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.