ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు అధికారిణి మిల్కా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళలో కే.ఎల్ గ్రూప్ కంపెనీ పాల్గొంటుందని పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గల యువతి యువకులు ఉదయం 11 గంటలకు హాజరై కంపెనీ హెచ్.ఆర్. ప్రతినిధులచే ఇంటర్వ్యూలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94405 86437ను సంప్రదించాలని సూచించారు.