– ఐటీ పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు
– సెంటిలియన్ నెట్‌వర్క్ పీవీటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభం
నవతెలంగాణ-మంథని
మంథనిలో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీతో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గోదావరిఖని రోడ్డున గల గిట్లస్ హబ్ వద్ద హైదరాబాద్‌కు చెందిన సెంటిలియన్ నెట్‌వర్క్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ నూతన బ్రాంచ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని మారుమూల ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించడం చాలా సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో మంథని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు, కంపెనీలు వస్తాయని చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో చుంది వెంకట్, డైరెక్టర్ రాధా కిషోర్, సిద్ధార్థ, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, హరిలు పాల్గొన్నారు.