కమలా హారీస్ ను గెలిపించండి: జో బైడెన్

నవతెలంగాణ – వాషింగ్టన్:  తమ డెమోక్రటిక్‌ పార్టీ మొత్తం ఐకమత్యంగా ఉందని చాటిచెప్పేలా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌  ఒకే వేదికను పంచుకొన్నారు. వాషింగ్టన్ శివార్లలోని మేరీల్యాండ్‌ కమ్యూనిటీ కాలేజ్‌ ఇందుకు వేదికగా మారింది. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ వైదొలగిన నాటినుంచి బైడెన్, కమలా హారిస్‌ ప్రచారంలో కనిపించని విషయం తెలిసిందే. వీరిద్దరినీ ఒకే వేదికపై చూసిన అభిమానులు ‘థాంక్యూ జో’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారిస్‌ అధ్యక్ష హోదాలో అద్భుతంగా పనిచేయగలరని కితాబిచ్చారు. కమలా ను గెలిపించండి అన్నారు. అనంతరం ట్రంప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. అసలు ట్రంప్‌ పేరు తనకు గుర్తులేనట్లే మాట్లాడుతూ ‘‘డొనాల్డ్‌ డంప్‌ లేదా ఏ డొనాల్డ్‌ అయినా’’ అంటూ వ్యాఖ్యానించడంతో అభిమానుల చప్పట్లతో వేదిక మార్మోగిపోయింది.

Spread the love