నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగికదాడి కేసులో ఎట్టకేలకు జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితమే బెంగళూరులో జానీ మాస్టర్ ని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇక అటు జానీ మాస్టర్ బాధితురాలికి భద్రత పెంచారు పోలీసులు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. జానీపై నాన్ బెయిలబుల్ కేస్ ఉందని చెబుతున్నారు. జానీపై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని..మాపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఇలాంటి కేసులలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని… పోక్సో చట్టం కూడా యాడ్ చేసామని వెల్లడించారు.