పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జానీ మాస్టర్ భార్య

నవతెలంగాణ – హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కావడంతో ఆయన భార్య సుమలత నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సుమలతను ఈ కేసు, అరెస్ట్ తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు యత్నించారు. కానీ సుమలత స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఓ ఫేక్ కాల్ వచ్చిందని, అందుకే పోలీస్ స్టేషన్‌కు వచ్చానని చెప్పారు. జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

Spread the love