కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లోకి చేరిక

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండలంలో శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే  మండలంలోని కాటేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా బేగంపూర్ గ్రామంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు 46 మంది పార్టీలోకి చేరారు. వీరికి షిండే పార్టీ ఖండువ వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం ప్రచారం లో ఆయన మాట్లాడుతూ  కాంగ్రేస్ పార్టీయే నాయకులు బీఆర్ఎస్ పార్టీ లోకి చేరడం చాలా సంతోషకరమైన  విషయము అని అన్నారు. భారత దేశంలో నే  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఎదో ఒక రూపమలో పథకాలు అందిస్తున్న ఘనత కేసీఆర్ కె దక్కుతుందని ఆయన కొనియాడారు. జుక్కల్ నియోజకవర్గ బిడ్డగా నన్ను నాలుగో సారి కారు గుర్తుకు ఓటు వేసి గెలపించలాని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లోకల్ లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తి లను తీసుకొని వస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు జుక్కల్ నియోజకవర్గంలో ఎం అభివృద్ధి చేశారో చెప్పలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్టం దేశంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లకు ఓటు వేస్తే జనాలు అందకరంలో ఉండాల్సిందే అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలించి అసెంబ్లీ కి పంపాలని జనాలకు కోరారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ శివరాం, మండల పార్టీ అధ్యక్షుడు విజయ దేశాయ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గుండె రావుపటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖండేరావు పటేల్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, మండల్ యూత్ ప్రెసిడెంట్ చిప్ప రమేష్, సుధీర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love