తొర్తి, గుమ్మిర్యాల్ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక..

నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలంలోని తొర్తి, గుమ్మిర్యాల్ గ్రామాల నుండి సుమారు 100 మంది బీజేపీ, కాంగ్రేస్, బీఎస్పీ పార్టీల నుండి మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూర్ణానందం,జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, తొర్తి సర్పంచ్ కుండ నవీన్, గ్రామశాఖ అధ్యక్షులు క్యాతం సుభాష్, వేశాల నర్సారెడ్డి, తోకల ఈశ్వర్, నాయకులు లింగారెడ్డి, ముక్కెర దేవన్న,తాహెర్, గంగభూమన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love