మండలంలోని పెద్ద దేవిసింగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని సీతారాం తాండలో మంగళవారం నాడు కాంగ్రేస్ పార్టీ కి చెందిన సుమారు 20 కుటుంబాలు అధికార పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ ఖండువ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీయే నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ లోకి చేరడం చాలా సంతోషకరమైన విషయము అని అన్నారు. భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఎదో ఒక రూపమలో అందిస్తున్న ఘనత కేసీఆర్ కె దక్కుతుందని ఆయన కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికి అందేవిదంగా అమలు చేస్తుందని అన్నారు. గ్రామీణ తాండలలో ప్రతి ఇంటికి మిషన్ భగీరత పథకం ద్వారా మంచి నీళ్ళు సరఫరా చేస్తుందని అదేవిధంగా పెద్ద కొడపగల మండలం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు సౌకర్యం కల్పించడం జరిగింది. పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల కోసం మన ఊరు మన బడి పథకంలో కోట్ల రూపాయలు వెచ్చించి నూతన తరగతి గదులను నిర్మాణం చేశామని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నమని ఆయన అన్నారు. అందుకే కోసమే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై అధికార బీఆర్‌ఎస్ పార్టీ లోకి చేరికలు జరుగుతున్నాయని ఆయన మాట్లాడుతూ తెలిపారు. వీరికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కకరు కల్సిమేలసి పని చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు తిర్మల్ రెడ్డి.సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి.సర్పంచ్ నానక్ రం, పార్టీ నాయకులు హసరాజ్, చందర్, చిప్ప రమేష్,హన్మంత్ రెడ్డి, కానీరం, పుండలిక్ నాయక్, శంకర్, జైపాల్, పత్తు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు