కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్‌ పలువురి చేరిక

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: మండలంలోని జగన్నాథ్ పల్లి తాండకు చెందిన కాంగ్రేస్ పార్టీ నాయకులు సుమారు 100 మంది  శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండేపార్టీ ఖండువ వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ లోకి చేరిన నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై మా తాండ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరడం జరగిందనిఎమ్మెల్యే హన్మంత్ షిండే కుఎన్నికల సమయంలో కష్టపడి మాతాండ నుండి భారీ మెజారిటీ ఈస్తామని గోతి బాబులాల్  అన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి చేరడం చాలా సంతోషకరమైన విషయమనిఅన్నారు. భారత దేశంలోనే  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఎదో ఒక రూపమలో  అందిస్తున్న ఘనత కేసీఆర్ కె దక్కిందని ఆయన కొనియాడారు. జుక్కల్ నియోజకవర్గ బిడ్డగా నన్ను నాలుగో సారి కారు గుర్తుకు ఓటు వేసి గెలపించలాని కోరారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు  ఎన్నికలో పోటీ చేసే ఇక్కడి లోకల్ నాయకులు దొరకడం లేదని దింతో  ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తి లను తీసుకొని వస్తున్నారని ఆయన విమర్శించారు.గతంలో అధికారంలో ఉన్న నాయకులు జుక్కల్ నియోజకవర్గంలోఎం అభివృద్ధి చేశారో చెప్పలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణా రాష్టం దేశంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లకు ఓటు వేస్తే జనాలు అందకరంలో ఉండాల్సిందే అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలించి అసెంబ్లీ కి పంపాలని తాండ వాసులకు  కోరారు.మీ తాండను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి.తాండ పెద్దలు గోతి బాబులాల్, సూరత్ రాం, లాగ్జిరం,మొహనెలాల్,మరియు తాండ వసూలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love