రేవల్- నవ తెలంగాణ : గౌరీదేవి పల్లి గ్రామం నుంచి బీజేపీ ముఖ్య నాయకులు గ్రామ అధ్యక్షుడు కాల్వ మల్లేష్, ఉపాధ్యక్షులు ఎద్దుల రమేష్, కార్యకర్తలు ఈ సుధాకర్, టి సుదర్శన్, వై కుర్మయ్య, వై విష్ణు, కే శ్రీనివాసులు, కృష్ణ బీజేపీ పార్టీ వీడి శనివారం మంత్రిగారి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎంపీటీసీ శ్రీశైలం, మాజీ సర్పంచ్ పాపులు ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదగా కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సురేందర్ రెడ్డి, ఎస్ శశిధర్ రెడ్డి, ఎస్ నారాయణ రెడ్డి, టి తిరుపతయ్య, కె కృష్ణ, రామకృష్ణ, వై మాసయ్య, వేణు, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.