బీ. ఆర్. ఎస్ పార్టీ లో చేరికల జోరు

– హుషారులో గులాబీ శ్రేణులు

– గులాబీ జెండా చేతిలో ఉంటే కొండంత అండ
– కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న గులాబీ దళపతి
– ముఖ్యమంత్రి  కేసిఆర్ నాయకత్వాన్ని బలపరుద్దాం
– బీ. ఆర్. ఎస్ ప్రభుత్వం లో ప్రతి ఇంటికి సంక్షేమం – ప్రతి వాడా వాడాలా అభివృద్ధి
– అభివృద్ధి చేసాం -ప్రజలకు వివరించండి
– ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీ. ఆర్. ఎస్ పార్టీలో భారీ చేరికలు
నవతెలంగాణ- కంటేశ్వర్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నాయకత్వం లో నిజామాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 200 మంది బీ. ఆర్. ఎస్ పార్టీ లో గురువారం చేరారు. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షతులవుతున్న యువత పెద్ద ఎత్తున బీ. ఆర్. ఎస్ పార్టీ లో చేరుతున్నారు అని తెలియజేశారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొనే పార్టీ బీ. ఆర్. ఎస్ పార్టీ.బీ. ఆర్. ఎస్ పార్టీ లో చేరిన వారందరికి మేమంతా రక్షణ కవచం ల ఉంటాము. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి బీ. ఆర్. ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చాక 9 ఏండ్లలో చేసి చూపించాము. నిజామాబాద్ నగరం లో సంక్షేమం అందని గడప లేదు, అభివృద్ధి చేయని గల్లీ లేదు. మనం చేసిన ప్రతి పని మన కళ్ళ ముందే ఉంది. ఇంటింటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని ఈ సందర్బంగా తెలియచేస్తూ బీ. ఆర్. ఎస్ పార్టీ లో చేరిన మీ అందరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం లో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీ. ఆర్. ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మల్లేష్ యాదవ్, ధర్మపురి, అంతరెడ్డి దేవి, బోడిగం నరేష్, బోడిగం ఆకాష్, బబ్బు, కరిపే రాజు, బోడిగం రాజశేఖర్, కోడిపాక రఘురామ్, సాయి కృష్ణ, క్రాంతి, రాము హాజరే, నరేష్, బోడిగం గోపి, ప్రకాష్, నగేష్, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love