నవతెలంగాణ హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి నివాసంలో టి.కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. బస్సు యాత్రా లేదా ఇతరత్రా మార్గాల్లో ముందుకెళ్లాలా? అనేది సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.