– ఉమ్మడి జిల్లా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులుగా బాధ్యతలు
– పారిశ్రామిక ప్రాంతంలో బలమైన కార్మికు ఉద్యమాల నిర్మాణం
– అనేక కంపెనీల యూనియన్ ఎన్నికల్లో విజయం
– కార్మికులు, పేదల పక్షాన పోరాడిన సీపీఐ(ఎం)
నవ తెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పటాన్‌చెరు అసెంబ్లీ ఎన్నికల బరిలో కార్మిక ఉద్యమ నాయకులు జొన్నలగడ్డ మల్లికార్జున్ నిలవనున్నారు. రాష్ట్రంలోని 17 స్థానంలో సీపీఐ(ఎం) పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జోన్నలగడ్డ మల్లికార్జున్ పోటీ చేయనున్నారు. ఆయన పేరును ఆదివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) దాని అనుబంధ కార్మిక సంఘం సీఐటీయూ ఇతర ప్రజాసంఘాలకు బలమైన ప్రజాదరణ ఉంది. అనేక కార్మిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు నడిపిన సీపీఐ(ఎం) ఎన్నికల్లో పోటీ చేయడంతో కార్మికులు, ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పాశంమైలారం, పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, రామచంద్రపురం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సైతం
ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతంలో కార్మికులు ఉద్యోగులు పట్టణ పేదల సమస్యలపై సీపీఐ(ఎం) అనేక పోరాటాలు సాగించింది. తెల్లాపూర్ బొల్లారం అమీన్పూర్ మున్సిపాలిటీలతో పాటు నాలుగు కార్పొరేషన్ డివిజన్ పరిధిలో సీపీఐ(ఎం), దాని అనుబంధ సంఘానికి పట్టిష్టమైన నిర్మాణం ఉన్నది. పట్టణ పేదలకు హిందూ ఇళ్ల స్థలాల సమస్యలపై సీపీఐ(ఎం) నిలబడి పోరాడింది. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం పెదల్ని కదిలించి పోరాటాలు నడిపింది. అమీన్పూర్ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అనేకమైన స్లమ్స్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై పోరాటాలు నడిపింది. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు పర్మనెంట్ కాంటాక్ట్ అంశాలపై సీఐటీయూ రాజీలేని పోరాటాలు నడిపింది. వందల సంఖ్యలో ఉన్న పరిశ్రమల్లో సీఐటీయూ నాయకత్వంలో వేతన ఒప్పందాలు కుదిరిస్తూ ఉద్యోగుల సంక్షేమం భద్రత కోసం సమశీల పోరాటాలు నడిపింది. కార్మికుల వేతనాలు పర్మినెంట్ ఉద్యోగ భద్రత పీఎఫ్ ఇఎస్‌ఐ వంటి సమస్యలపై పోరాడిన అతిపెద్ద కార్మిక సంఘం సీఐటీయూ. పటాన్చెరు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, మంచినీటి సమస్య లపై ప్రజలు కదిలించి ఆందోళనలు నిర్వహించింది. వందలాది కంపెనీలలో సీఐటీయూ గుర్తింపు సంఘంగా ఉన్నది. పాలక పార్టీల భ్రమలు తప్ప నియోజకవర్గ సమగ్ర అభివద్ధి కోసం జరిగిన కషి ఏమి లేదు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యం రోడ్లు విధ్వంసం, పరిశ్రమల నుంచి వ్యర్థాలు, దుర్గంధం నుండి ప్రజల్ని కాపాడాలని సీపీఐ(ఎం) ఆందోళన చేసింది. కార్మికులు పట్టణ పేదలు మధ్యతరగతి ప్రజల సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమాలు చేస్తూ వచ్చింది. పెరుగుతున్న ధరులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది. నిత్యావసరాల ధరలు తగ్గించాలని ప్రజల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికుల లోకాన్ని కదిలించి సీపీఐ(ఎం) పోరాటాలు నడిపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బాసటగా నిలిచింది సీపీఐ(ఎం). వేలాది మంది కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సమ్మెకు నాయకత్వం వహించింది. ఉపాధ్యాయులు ఉద్యోగుల పిఆర్సి సమస్య బదిలీలు వేతనాల సమస్యలపై సీఐటీయూ ముందుండి పని చేసింది. నిధులు నియామకాలు అనే నినాదంతో సాధించుకునే తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అనేక పోరాటాలు చేసింది. పటాన్చెరువు పారిశ్రామిక ప్రాంతంలో వంద పడకల ఐఎస్‌ఐ హాస్పిటల్ నిర్మించాలని సుదీర్ఘకాలం ఉద్యమిస్తూ వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఐటిఐలు పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మతి నైపుణ్యం పెంపొందించాలని అనేక కార్యక్రమాలు చేసింది.
విద్యార్థి, కార్మిక ఉద్యమాల్లో మల్లికార్జున్
సీపీఐ(ఎం) అభ్యర్థిగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న జొన్నలగడ్డ మల్లికార్జున్ 1964 ఏప్రిల్ 4న జొన్నలగడ్డ కనకదుర్గమ్మ సత్యనారాయణ దంపతులకు జన్మించారు. ఆయనకు కూతురు కుమారుడు ఉన్నారు. మల్లికార్జున్ భార్య లక్ష్మి కుమారి ప్రగతినగర్ సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. మల్లికార్జున్ రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే 1979లో విద్యార్థులు క్రియాశీలకంగా పని చేసే సీపీఐ రాజకీయాల వైపు వెళ్లారు. 1985 నుండి శాండ్విక్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేశారు. సీఐటీయూ క్రియాశీలక సభ్యునిగా హాల్విన్ వాజ్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేశారు. 2000 సంవత్సరం నుంచి సీపీఐ(ఎం) పూర్తి కాలం కార్యకర్తగా ప్రజాసేవకు అంకితమై పని చేస్తున్నారు. 1990లో ఉమ్మడి మెదక్ జిల్లా సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని పాశమైలారం పటాన్చెరువు రామచంద్రపురం బొల్లారం తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పరిశ్రమలలో యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నా రు. సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద పరిశ్రమ కావున తోషిబా కీర్తి పెన్నార్ ఎనర్జీ వంటి అనేక భారీ మధ్య తరహా పరిశ్రమలలో ఆయన నాయకుడిగా ఉన్నారు. రానే బ్రేక్ లైనర్ సుగుణ ఇండియా పరిశ్రమల్లో కూడా ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నారు. పరిశ్రమల యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో అనేక మంది ప్రత్యర్థులను, ప్రత్యర్థ సంఘాల సీనియర్ నాయకులపై జొన్నలగడ్డ మల్లికార్జున్ విజయం సాధించారు. 2016 నుంచి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై కార్మిక నిర్మాణం కోసం అంకితమై పని చేస్తున్నారు. 2023 మే లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతనాల సలహా మండలి లో ప్రభుత్వం చేత కార్మిక నాయకుడిగా ఆయన మండల సభ్యులుగా ఎన్నికై కొనసాగుతున్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అనేక కంపెనీలలో మెరుగైన వేతన ఒప్పందాలు కుదురుంచడం కార్మికుల ధైర్యం దిన సమస్యలపై పోరాటంలో ఆయన ముందున్నారు.