ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. ప్రకటించిన జొన్నవిత్తుల

నవతెలంగాణ – విజయవాడ: తెలుగు భాష, పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రకటించారు. నాయకులు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి జొన్నవిత్తుల ప్రకటించారు. భాషకు పునర్‌ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని చెప్పారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.

Spread the love