– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు..
నవతెలంగాణ చివ్వెంల: చివ్వెంల మండల వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ నిత్యం తమ దృష్టికి వచ్చిన అనేక సమస్యల ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం కోసం నిస్వార్ధంగా కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. జర్నలిస్టులలో అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలని,వారికి ఎలాంటి ఆదాయ వనరులు లేవన్నారు. ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుండి మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని నోటి మాటలు చెబుతున్నారు తప్ప నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమేజర్నలిస్టులందరికీఇంటి స్థలం మంజూరు చేసి, వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.