జేపీ నడ్డా రాజీనామా..

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నడ్డా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నడ్డా 2014 నుంచి 2019 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2020 జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ తో దేశంలోని 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండగా, వారిలో జేపీ నడ్డా కూడా ఉన్నారు. ఈ టర్మ్ ముగిసినప్పటికీ, నడ్డా మరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, నడ్డా మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.

Spread the love