జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR) అరుదైన రికార్డు

నవతెలంగాణ హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR) ఖాతాలో మరో రికార్డు నమోదైంది.  బ్రిటన్‌లో పాపులర్‌ వీక్లీ అయిన ఏసియన్ వీక్లీ న్యూస్‌ EasternEye 2023కిగాను టాప్‌ 50 ఏసియన్‌ స్టార్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కడం ఇండస్ట్రీలో హాట్ టాక్‌ గా నిలుస్తోంది.
ఈ జాబితాలో జూనియర్‌ ఎన్టీఆర్(Jr NTR ) 25వ స్థానంలో నిలిచాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక తెలుగు నటుడిగా అరుదైన ఫీట్ నమోదు చేశాడు తారక్‌. ఇప్పుడీ వార్తను టాలీవుడ్‌తోపాటు తారక్‌ లవర్స్‌, మూవీ లవర్స్‌, అభిమానులు, నెటిజన్లు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికన్‌ మ్యాగజైన variety ప్రకటించిన 500 అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి దక్షిణాది నటుడిగా అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు తారక్‌.

Spread the love