నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం హుస్నాబాద్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో జె ఎస్ ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎస్ఆర్ అభిమానులు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేదవారికి ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటు ముందుండేవాడన్నారు. వేసవికాలంలో బాటసారుల దాహం తీర్చేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా చలి వెంద్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఏడాది కొత్తకొండ జాతరలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటికి మొక్కలు అందజేశారన్నారు ప్రజల మన్ననలు పొందుతున్నా జేఎస్ఆర్ నిండు నూరేళ్ళు, సుఖసంతోషాలతో విలాసిల్లాలని భగవంతుని వేడుకున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు, తోట సమ్మయ్య, రాం ప్రసాద్, దేవేందర్ రెడ్డి, సంపత్ నాయక్ ,రవి, అనంతర స్వామి ,అరుణ్, రాజేందర్, మారోజు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.