దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జూడాల నిరసన

నవతెలంగాణ – హైదరాబాద్: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ లైంగికదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి, మంగళగిరి ఎయిమ్స్‌లో జూడాలు ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు. రేప్ నిందితుడిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కల్పించాలని నినాదాలు చేస్తున్నారు.

Spread the love