జడ్జిమెంట్‌ డే..

– కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
– బరిలో రంగారెడ్డి జిల్లాలో 209, వికారాబాద్‌ 61 మంది అభ్యర్థులు
– ఈవీఎంలల్లో అభ్యర్థుల భవితవ్యం
– రంగారెడ్డి జిల్లాలో 4, వికారాబాద్‌లో ఒకటి కౌంటింగ్‌ కేంద్రాలు
– శేరిలింగంపల్లిలో అత్యధికంగా 23, చేవెళ్లలో అతితక్కువ 19 రౌండ్లకే ఫలితాలు
– రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 28, అత్యల్పంగా 12 టెబుల్స్‌
– ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం
– మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, అనంతరం ఈవీఎంలు ప్రారంభం
– కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
– భారీ బందోబస్తు ఏర్పాటు
– ఫలితాలపై అభ్యర్థుల్లో ఆందోళన
– గెలుపుపై ఎవరి దీమా వారిదే..
– నేటితో ఉత్కంఠకు తెర.. ముగియనున్న ఎన్నికల పర్వం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల కౌంటింగ్‌ లెక్కించేందుకు మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4, వికారాబాద్‌ ఒకటి కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 209, వికారాబాద్‌ జిల్లాలో 61 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం ఈవీఎంలల్లో దాగి ఉంది. ఓట్ల లెక్కింపు 8గంటలకు ప్రారంభం అవుతుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలు చేయనున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్ల ఉత్కంఠకు నేటితో తెర పడనుంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాలను 166 టేబుల్స్‌పై ఈవీఎం,

51 టెబుల్స్‌ పై పోస్టల్‌ బ్యాలెట్‌, వికారాబాద్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలను 56 టెబుల్స్‌పై ఈవీఎం, 13 టెబుల్స్‌పై పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కౌటింగ్‌ మొత్తం సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తు మధ్యలోనే జరగనుంది. కౌటింగ్‌ కేంద్రాల వద్ద 144 అమలులో ఉంది. కౌంటింగ్‌ ఏర్పాట్లను ఇరు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 1085 మంది, వికారాబాద్‌ జిల్లాలో 426 మంది చొప్పున సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇందులో కౌటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌ టింగ్‌ అసిస్టెంట్స్‌, మైక్రో అబ్జర్వర్స్‌ స్థాయి ఉద్యోగులు కౌటింగ్‌ కేంద్రాల్లో ఉండనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ బోంగ్లూర్‌, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లి నియోజక వర్గం ఓట్ల లెక్కింపు గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీనగర్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, తాండూర్‌, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పరిగిలోని మార్కెట్‌ యార్డ్‌ గోదాంలో జరగనున్నాయి.
నాలుగు నియోజకవర్గాల
ఓట్లు రెండు హాల్స్‌లో లెక్కింపు…
సాధరణంగా ప్రతి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఒకే హాల్లో జరుగుతుంది. కానీ మహేశ్వరం, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు రెండు హాల్స్‌లో నిర్వహిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక నియో జకవర్గం ఓట్లు రెండు గదులల్లో నిర్వహించడంపై పలు పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఈ నియోజకవర్గాల్లో ఓటర్లు అత్యధికంగా ఉండటంతో 28 టెబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ టెబుల్స్‌ ఒకే హాల్‌లో ఏర్పాటు చేయడం కుదరకపోవడంతో రెండు హాల్స్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు.
ఓట్ల లెక్కింపు…
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఓట్ల లెక్కింపును ఇబ్రహీంపట్నం మం డలం మంగల్‌పల్లిలోని సీవీఆర్‌ ఇంజ నీరింగ్‌ కాలేజీలోని మొదటి అంతస్థులోని 218లో ఈవీఎం, 203లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– మహేశ్వరం నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని గ్రౌండ్‌ ప్లోర్‌లోని 101, 102 ఈవీఎం, 111,112లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– ఎల్బీనగర్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్‌ మండలంలోని ఇండోర్‌ స్టేడియంలోని హాల్‌ నెంబర్‌ 1,2లల్లో ఈవీఎం, హాల్‌ నెంబర్‌ 3లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు గండీపేట మం డలం హిమాయత్‌సాగర్‌లోని లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని నాలుగోవ అంతస్థులో హాల్‌ నెంబర్‌ 1, 2లో ఈవీ ఎంలు, 20లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు గచ్చిబౌలిలోని జీఎంసీ బలయోగి ఇండోర్‌ స్టేడియంలో హాల్‌ నెంబర్‌ 2,3లలో ఈవీఎంలు, హాల్‌ నెంబర్‌ 1లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– చేవెళ్ల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు గండిపేట్‌ మండలం హిమాయత్‌సాగర్‌లోని లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని మూడోవ అంతస్థులో హాల్‌ నెంబర్‌ 723, 724, 725 ఈవీఎం, హాల్‌ నెంబర్‌ 739లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– కల్వకుర్తి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో రెండవ అంతస్థులో హాల్‌ నెంబర్‌ 319 ఈవీఎం, హాల్‌ నెంబర్‌ 317లో పొస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– షాద్‌నగర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గండిపేట్‌ మండలం హిమాయత్‌సాగర్‌లోని లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని రెండోవ అంస్థులోని కాన్ఫ్‌రెన్స్‌హాల్‌లో ఈవీఎం, హాల్‌ నెంబర్‌ 216లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు.
– వికారాబాద్‌, పరిగి, తాండూర్‌, కొడంగల్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పరిగి పట్టణ కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో నిర్వహిం చనున్నారు.

Spread the love