ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. తీర్పు రిజర్వు

నవతెలంగాణ హైదరాబాద్: పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి కేసు విచారణ హైకోర్టులో మంగళవారం ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా, బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని.. విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించిన సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

Spread the love