నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు(భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.