న్యాయస్థానాల తీర్పులు అమలుకావట్లేదు..

– రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన
– ఈ విషయంలో కేంద్రం,కోర్టులు చొరవ తీసుకోవాలి
– జార్ఖండ్‌ హైకోర్టు కొత్త భవనం ప్రారంభం
రాంచీ: న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కొన్ని సందర్భాల్లో అమలు కాకపోవడంపై భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ముర్ము.. 165 ఎకరాల్లో నిర్మించిన జార్ఖండ్‌ కొత్త హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..”అనుకూలంగా తీర్పు వచ్చినా కొన్ని సందర్భాల్లో ఆ సంతోషం ప్రజల్లో ఎక్కువ సేపు ఉండటం లేదు. ఇందుకు కారణం కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడమేనని చెప్పారు. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్‌, సీనియర్‌ జడ్జీలు ఉన్నారు. వారందరికీ నా విన్నపం ఒకటే.. నిజమైన అర్థంలో న్యాయం ప్రజల దగ్గరకు వెళ్లేలా చూడండి” అని సూచించారు. సీజేఐ తన ప్రసంగాన్ని హిందీలో చేయడాన్ని అభినందించిన రాష్ట్రపతి న్యాయస్థా నాల భాష అందరినీ కలుపుకొని వెళ్లేలా ఉండాలని అన్నారు. ”అందు బాటులో ఉండటం అనేదానికి చాలా కోణాలు ఉంటాయి. అందులో ఖర్చు ఒకటి. కోర్టు దావాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలా మంది పౌరులకు న్యాయం చేరడం లేదు. దీనిపై అందరూ ఆలో చించాలి.కొత్త మార్గాలు అన్వేషించాలి. న్యాయస్థానాల భాష కూడా అందరినీ కలుపుకొనే వెళ్లేలా ఉండాలి” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.