– ఎమ్మెల్యేకు స్వాగతంలో పరమేష్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్
వెనకబడ్డ జుక్కల్ నియోజకవర్గం మీరు అమెరికా పర్యటనలో జుక్కల్ నియోజకవర్గం గుర్తింపు తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పరమేష్ పటేల్ అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అమెరికా పర్యటన ముగించుకొని గురువారం నాడు జుక్కల్ నియోజకవర్గం లో అడుగుపెట్టిన సందర్భంగా ఆ యువ నాయకులు ఎమ్మెల్యే కు స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించి బొొక్కెను అందజేశారు. ఈ సందర్భంగా అమెరికా పర్యటన జుక్కల్ ను ప్రపంచ దేశాలకు తెలియపరచిందని గుర్తు చేశారు. ఆ యువ నాయకుని వెంట చాలామంది యువకులు, ఎమ్మెల్యేను కలిసి స్వాగతం పలుకుతూ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.