నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామపంచాయతీ గ్రామ శివారు పరిధిలో గల సోమ లింగాల శివాలయాన్ని శనివారం నాడు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే సందర్శించి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే వెంటా గ్రామ మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.