అత్యంత వేడిమి రోజుగా జులై 3

న్యూయార్క్‌ : జులై 3వ తేదీ సోమవారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి రోజుగా నమోదయినట్టు అమెరికా జాతీయ పర్యావరణ కేంద్రాల డేటా పేర్కొంది. ఆ రోజున సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్‌గా (62.62 ఫారెన్‌హీట్‌) నమోదైంది. ఇప్పటివరకు 2016 ఆగస్టులో నమోదైన 16.92 డిగ్రీల సెల్సియస్‌ రికార్డుగా వుంది. దాన్ని అధిగమించి జులై 3వ తేదీ నాటి ఉష్ణోగ్రతలు సరి కొత్త రికార్డు సృష్టించాయని ఆ డేటా తెలిపింది. ప్రపంచ దేశాల్లో దాదాపుగా అన్ని చోట్లా వడగాడ్పులు వీస్తూనే వున్నాయి. ఈ రికార్డులేవీ కూడా మనం సంతోషించే మైలురాళ్ళు కావని లండన్‌కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్‌ ఓట్టో వ్యాఖ్యానించారు. ప్రజలకు, పర్యావరణ వ్యవస్థలకు ఇదొక మృత్యు శాసనమని అన్నారు.

Spread the love