– 2019 బకాయిలు ఇవ్వండి : టీజీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎమ్‌యూ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీజీఎస్‌ఆర్టీసీ కార్మికులకు రావల్సిన జులై నెల డిఏ బకాయిని బుధవారం చెల్లించారని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎమ్‌యూ) అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి, ఎమ్ నరేందర్ తెలిపారు. దీనితో కార్మికుల పెండింగ్ డిఏలు అన్నీ చెల్లించినట్టు అయ్యిందనీ, అందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్తున్నామని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే 2019 నుంచి రావలసిన డిఏ బకాయిలు, 2013 నాటి బాండ్ల సొమ్మును కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు.