ఆధార్ ఉచిత అప్డేట్‌కు జూన్ 14 చివరి తేదీ

Aadharనవతెలంగాణ – హైదరాబాద్
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసేందుకు జూన్ 14 చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 14 తర్వాత ఆధార్ అప్‌డేట్ చేసుకొనేవారు రుసుము చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది. గత పదేళ్లుగా ఆధార్‌కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోనివారు ఈ ఉచిత అప్‌డేట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే జూన్ 14 తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పోతుందని జరుగుతున్న ప్రచారాన్ని యూఐడీఏఐ ఖండించింది.
Spread the love