జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూరాలనేదే కేసీఆర్‌ ఆలోచన: జూపల్లి

నవతెలంగాణ – హైదరాబాద్‌:  చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్‌ భావించారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌కు.. చంద్రబాబు రాజకీయంగా సరిపడదు. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్‌ భావించారు. అందుకే జగన్‌కు రాజకీయ లబ్ధి కలిగేలా కేసీఆర్‌ సహకరించారు. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్‌ మద్దతిచ్చేలా ప్రయత్నించారు ’’ అని జూపల్లి విమర్శించారు.

Spread the love