జురెల్‌ హాఫ్‌ సెంచరీ..భారత్ స్కోరు 267/8

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో భారత్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే టీమ్‌ఇండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 219 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌ను ఆదివారం ఆటను ప్రారంభించిన ధ్రువ్‌ జురెల్, కుల్‌దీప్‌ యాదవ్‌ కొద్దిసేపు నిలకడగానే ఆడారు. అయితే ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో ఇంగ్లిష్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ వేసిన 3వ బంతికి కుల్‌దీప్‌ (28) ఔటయ్యాడ్‌. అండర్సన్‌ వేసిన బంతి కుల్‌దీప్‌ బ్యాట్‌ ఇన్‌సైట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో జురెల్‌, యాదవ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, కష్టాల్లో కూరుకుపోయిన జట్టును జురెల్‌ ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లోయర్‌ ఆర్డర్‌ అండతో 99 బాల్స్‌లో 50 పరుగులు చేసి టెస్టుల్లో తన తొలి అర్ధసెంచరీని సాధించాడు. అయితే కుల్దీప్‌ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నయా బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ అతడికి చక్కని సహకారం అందిస్తున్నాడు. 95 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 267 పరుగులు చేసింది. జురెల్ (60), ఆకాశ్ దీప్ (3) పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్‌ కంటే మరో 86 పరుగులు వెనకపడింది.

Spread the love