– సహకార బ్యాంకులు : జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుకర్
నవతెలంగాణ-మల్హర్‌రావు
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి కార్పొరేట్ బ్యాంకుల తరహాలో సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, సహకార బ్యాంకుల పనితీరు చూస్తే అర్థం అవు తుందని బీఆర్‌ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. బుధవారం మండలంలో సహకార బ్యాంకు తాడిచర్ల బ్రాంచ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం లో జిల్లా సహకార చైర్మెన్ కొండూరి రవీందర్ రావు, భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో అక్కడక్కడ కార్పొరేట్ బ్యాంకులను మాత్రమే చూసే వారమని, నేడు తాడిచర్ల లాంటి ప్రాంతాలోనూ కార్పొరేట్ స్థాయి సహకార బ్యాంకును ప్రారంభించుకున్నాటమని తెలిపారు. కో ఆపరేటివ్ సొసైటీని అభివృధ్ది పథంలో నడిపించిన కోడూరి రవీందర్‌రావు సేవలు మరవలేనివని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కోడూరు రవీందర్‌రావు సహకార బ్యాంకుల బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల కష్టాలను గుర్తించి తహశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాల యాలను మండల కేంద్రానికి తరలించామని చెప్పారు. భూపాలపల్లి నుంచి తాడిచర్ల, ఖమ్మంపల్లి మీదుగా మంథనికి రహదారి కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేశామని, త్వరలో రహదారి నిర్మాణం పూర్తవుతుందన్నారు. తాడిచర్ల జెన్‌కో సంస్థ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, భూముల విషయంలో, నిరుద్యోగుల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. సహకార బ్యాంకు అధికారులు రైతులను ప్రోత్స హించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.