అన్ని వర్గాలకు న్యాయం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

– బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-కోట్‌పల్లి
బీర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరిందని బీఆర్‌ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. గురువారం కోట్‌ పల్లి మండల పరిధిలోని బీరోల్‌, జిన్నారం, రాంపూర్‌, ఎన్కెపల్లి, ఎన్నారం, కొత్తపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతు భీమా అందించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడవసారి ముఖ్యమంత్రిగా చేసేందకు కృషి చేయాలని తెలిపారు. చదువుకునే పిల్లలకు సన్న బువ్వ పెట్టినట్టే, ఇకపై రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలందరికీ సన్నబియ్యం ప్రభుత్వం అందించనుందని తెలిపారు. గతంలో అధికారంలో ఉండి అంధకారంలో ఉంచిన కాంగ్రెస్‌ పార్టీ అబద్దపు ఆరు హామీలను ఎవ్వరు నమ్మరాదని, ఆచరణలో ప్రజా సంక్షేమాన్ని సంపూర్ణంగా అందించిన బీఆర్‌ఎస్‌కే మరోసారి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అనీల్‌, వైస్‌ ఎంపీపీ ఉమాదేవి నర్సింలు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, స్సర్పంచులు సావిత్రి దశరథ్‌ గౌడ్‌, మల్లన్న, సూర్యకళ మాణిక్యం, అనిత గోపాల్‌ రెడ్డి, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love