కాంగ్రెస్‌ తోనే అన్ని వర్గాలకు న్యాయం: సురేష్

నవతెలంగాణ పెద్దవంగర: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. సోమవారం మండలంలోని మోత్య తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలు బీఆర్‌ఎస్‌ నియంత పాలనలో విసిగిపోయారని, పేదలు, అణగారిన వర్గాల వారు వివక్షకు గురవుతున్నారని, ఆ పాలనకు ప్రజలే చరమగీతం పాడి, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాల పంట పండుతుందన్నారు. టీపీసీసీ సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రంగు మురళీ, నాయకులు పాండు, వార్డు సభ్యులు భూక్య పూలమ్మ, బానోత్ రాములు, బానోత్ భీమా, భూక్యా కిష్టు తదితరులు పాల్గొన్నారు.
Spread the love