– కోదండరాంకు అణగారిన క్రైస్తవ జన సమాఖ్య వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళితుల నుంచి క్రైస్తవులుగా మారిన వారికి న్యాయం చేయాలని అణగారిన క్రైస్తవ జన సమాఖ్య (ఉద్యమ పార్టీ) కోరింది. ఈ మేరకు బుధవారం సమాఖ్య జాతీయ కన్వీనర్ నాగళ్ల పోచయ్య ఇశ్రాయేల్, జాతీయ కో కన్వీనర్లు ఎం.వీ.జాన్సన్, ఆండ్య్రూ జేవియర్ హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం సమర్పించారు. దళిత క్రైస్తవులను తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు బీసీ-సీలో ఉన్న దళిత క్రైస్తవులకు ప్రత్యేక కమిషన్, మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని సూచించారు. దళితుల నుంచి బుద్ధిస్టులుగా, సిక్కులుగా మారిన వారిని తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చారని వారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ వారి సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.